ETV Bharat / state

TALASANI: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేదే లేదు: తలసాని

జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ భూములపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ సర్వే నిర్వహించారు. అమీర్‌పేటలో అధికార పార్టీ నేతలు భూమిని ఆక్రమించారని ఆరోపణలు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం బంజారాహిల్స్​లోని నాలా పనులను పర్యవేక్షించారు.

Minister talasani srinivas yadav
జీహెచ్​ఎంసీలో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
author img

By

Published : Jun 15, 2021, 4:03 PM IST

పార్టీ పేరు చెప్పి ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ భూములపై సర్వే చేశారు. హైదరాబాద్‌ అమీర్‌పేట డివిజన్‌లోసుమారు 400 గజాల స్థలం అధికార పార్టీ నేతలు ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు సంబంధించిన భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని పేర్కొన్నారు. బాబునగర్‌లో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ వన్‌లో పూడికతీత పనులను పరిశీలించారు.

జీహెచ్​ఎంసీలో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నాలా పనులను పర్యవేక్షించిన మంత్రి

Minister talasani srinivas yadav v

నాలాలపై ఉన్న ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. పూడిక తొలగించేందుకు చేపట్టిన వారం రోజుల స్పెషల్ డ్రైవ్​లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్​ వన్​లోని బల్కాపూర్ నాలా పనులను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, జోనల్ కమిషనర్ ప్రావిణ్యతో కలిసి పరిశీలించారు. దాదాపు 1.65 కిలోమీటర్ల మేర పూడిక తొలగింపు పనులను 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందులో 80 శాతం పైగా పనులు పూర్తి అయినట్లు చెప్పారు. ఇదే నాలాపై పెన్షన్ ఆఫీస్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణం వలన నీరు నిలిచిపోతోందని స్థానికులు మంత్రికి పిర్యాదు చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్యను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్ అహ్మద్ సర్ఫరాజ్ సిద్దిఖ్, డీసీ ఇంతేషాప్ అలీ, ఏస్ఈ రత్నాకర్, ఈఈ లాల్ సింగ్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: Etela : హైదరాబాద్​ చేరుకున్న ఈటల బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.