ETV Bharat / state

రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరాసదే విజయం: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస విజయం సాధిస్తుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీపై విపక్షాలు గాలి మాటలు ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు.

రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరాసదే విజయం: తలసాని

author img

By

Published : Mar 19, 2021, 5:53 PM IST

రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరాసనే గెలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మొదట్నుంచి తెరాస అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి ఆధిక్యంలోనే ఉన్నారన్నారు. పట్టభద్రులు స్పందించి ఓట్లు వేశారని.. అయితే చాలా ప్రచారం చేసినప్పటికీ చెల్లని ఓట్లు వేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో ఉద్వేగభరిత అంశాల ప్రభావం నీటిబుడగల్లా తాత్కాలికంగానే ఉంటుందని తలసాని అన్నారు.

ఉద్యోగాల భర్తీపై విపక్షాలు గాలి మాటలు ప్రచారం చేశాయని మంత్రి ఆరోపించారు. ఇంటింటికీ ఉద్యోగం అవసరం ఉండదని.. అవసరాన్ని బట్టి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వివిధ శాఖల వారీగా ఖాళీలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ త్వరలో అప్ గ్రేడ్ చేయబోతున్నట్లు తలసాని పేర్కొన్నారు.

రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరాసదే విజయం: తలసాని

ఇదీ చదవండి: ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.