Talasani Srinivas Yadav Spoke In Budget Speech: రాయితీలపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 6వతేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై.. గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. మూడోరోజు సభ ప్రారంభమైన సభలో మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఆ సంవత్సరం 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించామని గర్వంగా చెప్పుకున్నారు. అదే 2022-23 సంవత్సరానికి 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయితీపై చేప పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని వ్యాఖ్యానించారు.
చేపలు పట్టేందుకు మత్స్యకార కులస్తులకే హక్కులు అన్నీ కల్పిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. చెరువుల్లో చేపలు పట్టేందుకు ఇతర వర్గాల వారికి హక్కులేదని ప్రకటించారు. ఇందు కోసం మత్స్యకారులకు ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చామని వివరించారు. ఉచితంగా మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 3.65లక్షల మందికి మత్స్యకారులుగా సభ్యత్వం ఉందన్నారు. కొత్తగా మరో లక్ష మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.
పాడి రైతులకు రాయితీ ఇస్తున్నాం: మార్చి నుంచి జూలై వరకు పాల ఉత్పత్తి రోజుకు 56.51 లక్షల లీటర్లు వస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కొక్కరికీ రోజుకు 145.15 గ్రాముల పాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75శాతం రాయితీపై పాడి పశువులు పంచామని తెలిపారు. నాలుగు సహకార డెయిరీలకు రూ.4 రాయితీ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
ఇవీ చదవండి: