ఆగస్టు 1న నిర్వహించే పాతబస్తీ బోనాల వేడుకలకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. ఇందుకోసం రూ.7 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు, ఊరేగింపుల కమిటీలతో సమావేశమైన మంత్రి.. రాష్ట్ర సంస్కృతి చాటిచెప్పేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
పాతబస్తీ బోనాల ఉత్సవాల్లో పలు అభివృద్ధి పనులు, భక్తులకు కనీస వసతులకు రూ.7 కోట్లు మంజూరు చేసినట్లు తలసాని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: గోల్కొండ తల్లికి తొలి బోనం.. భాగ్యనగరమంతా కోలాహలం