ETV Bharat / state

'గ్రేటర్ ​పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం' - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్ నగరంలో ఈ నెల 14న మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్తీ దవాఖానాల ప్రారంభ ఏర్పాట్లపై మసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

minister talasani srinivas yadav review on basti dawakhana
'గ్రేటర్ ​పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం'
author img

By

Published : Aug 11, 2020, 5:31 PM IST

గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ప్రస్తుతం 197 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈనెల 14న మరో 26 దవాఖానలను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. నూతనంగా ప్రారంభించబోయే దవాఖానల ఏర్పాట్లపై మసబ్​ట్యాంక్​లోని తన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.

పేదలకు వైద్యసేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. నూతన ఆస్పత్రులను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, హైదరాబాద్​ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, మూడు జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కుంగుతున్న కాలువలు... వృథాగా పోతున్న నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.