రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవీని గెలిపించాలని కోరారు. విద్యారంగంలో అపార అనుభవం కలిగిన ఆమెకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సనత్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు.
తెరాస హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం వాణీదేవీని గెలిపించాలని కోరారు. కార్పొరేటర్లు, తెరాస డివిజన్ అధ్యక్షులు సమన్వయంతో వ్యవహరించి... పట్టభద్రుల ఓటర్లను గుర్తించి ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణీ, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించండి'