ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నా ఒక్క క్రిస్మస్ని మాత్రమే అన్ని దేశాలు కలిసి ఒకే తేదీన జరుపుకుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మంత్రి సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న వెస్లీ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ ఆకుల రూప, తెరాస నాయకులు ఉన్నారు.
ఏసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను, మతాలను సమానంగా చూస్తూ వారికి కావాల్సిన పండగ బహుమతులను అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్లకు పెద్దపీట వేసిందని సర్వమత ప్రాధాన్యతకు సీఎం కేసీఆర్ నిదర్శనంగా నిలుస్తారని తలసాని అన్నారు.
ఇవీ చూడండి: హీరా గ్రూప్ ఎండీ నౌహీరాకు బెయిల్