పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. సాయి చరణ్ కాలనీలో 108 ఇళ్లు, టి.అంజయ్య నగర్ లో 35 రెండు పడకల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు.
బస్తీల్లోని పేదల బాధలు అర్ధం చేసుకుని డిగ్నిటీ కాలనీ పేర్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కట్టిస్తున్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టేవారిని పట్టించుకోవద్దు. వచ్చిన దానితో సంతృప్తి చెందాలి. అంతే కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు. రెండు ఇళ్లు కావాలి మూడు ఇళ్లు కావలంటే కుదరదు. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలనీ వాసులు రెచ్చగొట్టేవారిని పట్టించుకోవద్దు. పరిశుభ్రత, నిర్వహణ కోసం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. సంక్షేమ పథకాలు, హరితహారం వంటి కార్యక్రమాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనుంది.
- తలసాని శ్రీనివాస్ యాదవ్ ,మంత్రి
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోపాల్, నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: PROPERTY ISSUE: ఇల్లొదిలి వచ్చేశాను.. భర్త ఆస్తి నాకొస్తుందా..?