నగరంలో నూతనంగా నిర్మించిన వైట్ ట్యాపింగ్ రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మినిస్టర్ రోడ్డులో వ్యాపారులు మంత్రి తలసానికి విన్నవించుకున్నారు. వ్యాపారుల సమస్యను తెలుసుకునేందుకు ఇవాళ ఆయన రాణిగంజ్‌లోని ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. ఫుట్‌పాత్ పనులు చేసేటప్పుడు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా దుకాణదారులు కూడా నగరాభివృద్ధికోసం చేస్తున్న పనుల్లో రాజకీయ పరమైన అంశాలను తీసుకురావొద్దని ఆయన సూచించారు. వైట్ టాపింగ్ రోడ్లు వల్ల ఎంతో ఉపయోగం ఉందని వారికి వివరించారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం...