హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చేపల వంటల స్టాళ్లను మంత్రి కలియ తిరిగి పరిశీలించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే కేసీఆర్ అభిమతమని మంత్రి పేర్కొన్నారు. మత్స్య రంగం అభివృద్ధికై కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు.