ETV Bharat / state

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని

సికింద్రాబాద్ సర్దార్​పటేల్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంతో పాటు నూతన ద్వారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తయారు చేసిన ఘనత ఎస్​పీ కళాశాలకు దక్కిందన్నారు.

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని
author img

By

Published : Aug 31, 2019, 6:26 AM IST

హైదరాబాద్​ పద్మారావునగర్​లోని సర్దార్ పటేల్ కళాశాల సర్దార్ పటేల్ విగ్రహంతో పాటు నూతన ద్వారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. పరేడ్​లో పాల్గొన్న ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థిని విద్యార్థులను మంత్రి అభినందించారు.దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరని గుర్తు చేశారు. కళాశాలలో చదవకపోయినా గత 27 ఏళ్ల నుంచి తన రాజకీయ జీవితానికి కళాశాలకు సంబంధముందన్నారు. సర్దార్ పటేల్ కళాశాలలో చదువుకున్న వారంతా మంచి స్థానంలో ఉన్నారని తెలిపారు. మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్ కూడా ఇదే కళాశాలలో చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు . ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలతో పోటీపడుతూ సేవాభావంతో కళాశాలను నడుపుతున్నారని కొనియాడారు.

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని

ఇదీ చూడండి :నేటి నుంచే అంతర్జాతీయ స్నాక్స్​ ఫెస్టివల్​

Intro:సర్దార్ పటేల్ కళాశాల లో నూతన ద్వారం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ .

పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కళాశాల నూతన ద్వారము ప్రారంభం, సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ, నూతన హాస్టల్ ను శుక్రవారం పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎన్ సి సి విద్యార్థిని విద్యార్థులు పరేడ్ తోఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరని గుర్తు చేశారు.నేను ఈ కళాశాలలో చదవకపోయినా గత 27 సంవత్సరాల నుండి నా రాజకీయ జీవితం అంతా ఈ కళాశాల చుట్టే తిరుగుతుందని అన్నారు . నాడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో, నేడు సనత్ నగర్ నియోజకవర్గంలో శాసన సభ్యునిగా ఉన్న ఈ కళాశాల నా పరిధిలోనే ఉందని, ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూతులు ఈ కళాశాలలోనే ఏర్పాటు చేయడం, నేను రావడం జరుగుతుందని గుర్తు చేశారు.సర్దార్ పటేల్ కళాశాల లో చదువుకున్న వారంతా రాజకీయ నాయకులు, ఐఏఎస్ ,ఐపీఎస్ లు, డాక్టర్లు, క్రీడాకారులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ కళాశాలలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు అని అన్నారు. నేడు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాల పొందుతున్నారని ప్రిన్సిపల్ చెప్పడం సంతోషకర విషయం అన్నారు.1970లో ప్రారంభమైన కళాశాల వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా భారతదేశ ఉప రాష్ట్రపతిని ఆహ్వానించడానికి నేను కూడా ముందుంటానని అన్నారు. నేటి మంత్రులు చామకూర మల్లారెడ్డి, నిరంజన్ కూడా ఇదే కళాశాలలో చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు . ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలతో పోటీపడుతూ సేవాభావంతో కళాశాలను నడుపుతున్నారని కొనియాడారు..బైట్..తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిBody:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.