తాండూరు పురపాలికను ఎంఐఎం పార్టీకి ఇచ్చినట్లు విపక్షాలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎంఐఎంతో తమకు ఎటువంటి పొత్తులేదని స్పష్టం చేశారు.
ఎంఐఎం పోటీ చేసిన చోటు భాజపా ఎందుకు బరిలో లేదని, వారితో ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా అని కమలం పార్టీనుద్దేశించి మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపాలకు ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
- ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు