ETV Bharat / state

MINISTER TALASANI on Dairy: 85 డెయిరీ పార్లర్లను 544కు పెంచాం: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్

విజయ డెయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Reddy) శాసనమండలిలో వెల్లడించారు. మెగా డెయిరీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సభ్యులు ఎంఎస్​ ప్రభాకర్‌రావు, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

MINISTER TALASANI
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
author img

By

Published : Oct 5, 2021, 12:31 PM IST

కరీంనగర్‌ జిల్లా పాడి రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం అందడం లేదని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. కరీంనగర్‌, ముల్కనూరు, నల్గొండ పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతోనే 50 శాతం రాయితీతో పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Reddy) వెల్లడించారు. పాల సేకరణ లక్ష లీటర్ల నుంచి నాలుగున్నర లక్షలకు పెంచామన్నారు. 4 రూపాయల రాయితీగా 285 కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

కరీంనగర్‌ డెయిరీకి ప్రోత్సాహకంపై అధికారులు దృష్టిపెట్టారు. తెరాస పాలనలో పాడి రైతుల సంఖ్య లక్ష 32వేలకు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ఉన్న డెయిరీ పార్లర్లు 85 మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా పార్లర్ల సంఖ్య 544కు పెంచాం. విజయ డెయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

-మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ (Minister Talasani Srinivas Reddy)

రాష్ట్రంలో 35వేల మంది ఉన్న పాడి రైతుల సంఖ్య.. తెరాస పాలనలో లక్షా 32వేలకు పెరిగిందని మంత్రి (Minister Talasani Srinivas Reddy) వెల్లడించారు. 85 పార్లర్లు ఉండగా తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 544 పార్లర్లకు విజయ డెయిరీని విస్తరింపజేశామన్నారు. రావిరాల ప్రాంతంలో మెగా డెయిరీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని (Minister Talasani Srinivas Reddy) మండలిలో వెల్లడించారు.

విజయ డెయిరీ

ఇదీ చూడండి: KTR on Lakhimpur Kheri incident: 'లఖింపుర్ ఖేర్ ఘటన అనాగరికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.