హైదరాబాద్ జియాగూడలోని రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అర్హులైన 568 మందికి కేటీఆర్ అందించనున్నారని తెలిపారు. మిగతా 307 ఇళ్లను అవసరం ఉన్న పేదవారికి అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈసారి దసరా పండుగ రెండు పడక గదుల ఇళ్లలో తమ జీవితంలో మర్చిపోలేనంత సంబురంగా జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: తలసాని