ETV Bharat / state

'జూన్ నెలాఖరు నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ' - గొర్రెల షెడ్లు

మాసబ్‌ట్యాంకులోని పశు సంక్షేమ శాఖ భవన్‌లో.. మంత్రి తలసాని అధికారులతో సమీక్షించారు. జూన్ నెలాఖరు నుంచి రెండో విడత గొర్రెల పంపిణీని చేపడతామని తెలిపారు. తీవ్రమైన ఎండలతో గ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున కార్యక్రమాన్ని కాస్త ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు వివరించారు.

second shift of gorrela pampini
రెండో విడత గొర్రెల పంపిణీ
author img

By

Published : Apr 19, 2021, 5:55 PM IST

జూన్ నెలాఖరు నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని పశు సంక్షేమ శాఖ భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.

రెండో విడత గొర్రెల పంపిణీతో పాటు.. మార్కెట్లు, షెడ్ల నిర్మాణం, పశువుల ఆరోగ్య సంరక్షణ, టీకాల పంపిణీ వంటి పలు అంశాలపై మంత్రి విస్తృతంగా చర్చించారు. రెండో విడత కోసం ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మంజూరు చేసినా.. తీవ్రమైన ఎండలతో గ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో, వర్షాకాలం ప్రారంభమైన వెంటనే పంపిణీని చేపడతామని ఆయన వివరించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్భందీగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో 3, 66, 976 మంది లబ్ధిదారులకు 77. 06 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు తలసాని గుర్తు చేశారు.

అన్ని జిల్లాల్లో గొర్రెల మార్కెట్లు..

ప్రభుత్వం.. గొర్రెల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పెద్దపల్లిలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. కామారెడ్డి, ఖమ్మం, వనపర్తిలలో కూడా త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మిగతా జిల్లాల్లో మార్కెట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

తెలంగాణా బ్రాండ్‌తో విక్రయాలు..

తక్కువ ధరకే.. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందజేయాలనే ఉద్దేశంతో తీసుకురానున్న తెలంగాణా బ్రాండ్ విక్రయాలను వీలైనంత త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

షెడ్లు ఏర్పాటవుతున్నాయి..

6 పశువులు ఉండేందుకు వీలుగా రూ. 57 వేలతో ఒక్కో షెడ్డు నిర్మించి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. 6, 453 మంది రైతులు షెడ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 3, 631 షెడ్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. మిగతా 2,822 షెడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ఆయా కలెక్టర్లతో సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

బర్డ్ ఫ్లూ కేసులు లేవు..

అనేక రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మంత్రి వివరించారు. శాఖ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్లే అది సాధ్యమైందన్నారు. గ్రామీణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉండేలా పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో.. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు రాంచందర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉప్పులోనూ రకాలున్నాయ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.