ETV Bharat / state

'జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 45 బస్తీ దవాఖానాలు' - హైదరాబాద్​ తాజా వార్తలు

శుక్రవారం నుంచి జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 45 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. దీంతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక వైద్యుడు, ఓ నర్స్​, ఓ సహాయకుడు ఉంటారని వివరించారు.

'జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 45 బస్తీ దవాఖానాలు'

author img

By

Published : May 20, 2020, 5:16 PM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం నుంచి కొత్తగా 45 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్​లో 22, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలు ఈనెల 22న కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజు 10 వేల మందికి వైద్యసేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు.

నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయన్నారు. ఒక్కో బస్తీ దవాఖానలో ఒక వైద్యుడు, ఓ నర్స్‌, ఓ సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని వివరించారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను విస్తృతం చేస్తోందన్నారు.

ఇదీ చూడండి: కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.