ganesh navratri 2022 గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 31న మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో గణేశ్ నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశాల్లో హోంమంత్రి మహమూద్ అలీ, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 9న జరుగుతుందని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి తలా లక్షా విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. నిమజ్జనం రోజు లైటింగ్, క్రేన్‌లు, జనరేటర్లు, స్టేజ్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. హుస్సేన్‌సాగర్‌లో గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని మంత్రి వివరించారు.
ఇవీ చూడండి..
NGT notices on NIMZ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు
జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి