ETV Bharat / state

'తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తారు' - హైదరాబాద్​ తాజా వార్త

హైదరబాద్​లోని జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో జరగబోయే  వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి ప్రభుత్వం  అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు.

minister talasani review meet
'తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తారు'
author img

By

Published : Dec 17, 2019, 4:20 PM IST

హైదరాబాద్​ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో జనవరి 6వ తేదీన నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. రంగనాథ స్వామి దేవాలయ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తామని, తిరుపతికి వెళ్లలేని వారు ఎంతో నమ్మకంతో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటివి కూడా చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

'తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడికి వస్తారు'

ఇదీ చూడండి: రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం

Intro:Body:

tg-hyd-13-17-talasani-pc-ts10008_17122019124256_1712f_1576566776_792

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.