హైదరాబాద్‌లో పురపాలక ఎన్నికలు ఎప్పడైనా రావచ్చునని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్‌లో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీగా తెరాస అవతరించిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోన్న వ్యక్తి కేసీఆర్ అని... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోన్న ఘనత ఆయనదేనని ప్రశంసించారు.
ఇదీ చూడండి : రేపు ప్రగతిభవన్లో మంత్రివర్గ భేటీ