సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పేద ప్రజల ఆకలి తెలిసిన నాయకుడు కీసీఆర్ అని తలసాని అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో రోడ్లపై ఉన్న చెత్తను, మురికిని, శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు గొప్పవని ఆయన తెలిపారు. కరోనా సమయం నుంచి అంచెలంచెలుగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వేతనాలు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
అదేవిధంగా నగర ప్రజలకు 50 శాతం పన్ను రాయితీని కల్పించడం శుభపరిణామమని అన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వరద బాధితుల విషయంలో చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే 77 వేల కుటుంబాలకు వరద సాయం అందించామని ఆయన వెల్లడించారు. వరద సాయం అందని బాధితులు దగ్గరలోని మీసేవలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: ప్రజారోగ్యానికి 'పంచతత్వ'... హైదరాబాద్లో పార్కు ప్రారంభోత్సవం