రాష్ట్రంలో పాడి రైతులు, డెయిరీ యజమానులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో డెయిరీ యజమానులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో పాల ఉత్పత్తి, సేకరణ, సరఫరాలపై సమీక్షించారు.
రైతుల నుంచి పాల సేకరణ, ప్రొసెసింగ్, పంపిణీలో ఇబ్బందులు... కుటుంబాలకు చేర్చడంలో ఎదురవుతున్న అవాంతరాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే 040-23450624, 9848022055 నంబర్లకు ఫోన్ ఫోసి తమ దృష్టికి తీసుకురావొచ్చని చెబుతున్న మంత్రి శ్రీనివాసయాదవ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..