ETV Bharat / state

'పద్మారావునగర్​ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం' - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

సనత్​నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఫుట్​పాత్​ పనులకు మరమ్మతు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Minister Talasani initiated development works at padmarao nagar
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని
author img

By

Published : Feb 24, 2020, 7:38 PM IST

Updated : Feb 24, 2020, 7:44 PM IST

హైదరాబాద్​ సనత్​నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పద్మారావునగర్​లో రూ. 42 లక్షల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బలరాం కాలనీలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ హేమలతతో కలిసి ఆయన ఆరంభించారు. అక్రమ కట్టడాలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తలసానికి విన్నవించగా వెంటనే ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఫుట్​పాత్​లను మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు.

పార్క్​ల్లో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కలు నాటాలని తెలిపారు. అభినవ్​ ​నగర్​లో మూడు లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులను మొదలు పెట్టారు. ఆరు లక్షల రూపాయల వ్యయంతో మున్సిపల్ పార్కులు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని

ఇదీ చూడండి : ఏం చేశారని నిలదీసిన స్థానికుడు... కోపానికొచ్చిన మంత్రి

Last Updated : Feb 24, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.