ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో తెరాస నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన జన్మదిన వేడుకలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వగా.. గులాబీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాంపల్లిలో తెరాస ఇన్‌ఛార్జి ఆనంద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.
నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి రోగులకు, వారి బంధువులకు భౌతిక దూరం పాటిస్తూ పండ్లు పంపిణీ చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే బయటకు రావాలని మంత్రి సూచించారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తలసాని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు