హైదరాబాద్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో జూమ్ ద్వారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఐటీ సెక్రటరీ జయేశ్‌రంజన్ హాజరయ్యారు. ముందుగా రాష్ట్రంలో కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను అభినందించారు.
గ్రామాల్లో, మురికివాడల్లో నివసించే మహిళలకు ఉపాధి కల్పించే దిశగా వారికి శిక్షణ ఇవ్వడంపై తరగతులను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సంస్థ ద్వారా ఇప్పటికే పలు చోట్ల పీపీఈ కిట్లు, శానిటైషన్ వస్తువులు తయారీ చేస్తున్నవారిని అభినందించారు.