ETV Bharat / state

'తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్​ సేవలు ఎనలేనివి' - minister srinivas goud news

అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆచార్య జయశంకర్​ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కొండాపూర్​లో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హాజరై ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలియజేశారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆచార్య జయశంకర్​ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

srinivas goud
srinivas goud
author img

By

Published : Jun 21, 2021, 7:33 PM IST

ప్రపంచానికి మన దేశం అందించిన గొప్పవరం యోగా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్​ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య వర్ధంతి సందర్భంగా మంత్రి​ హైదరాబాద్​లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

యోగాసనాలు

కొండాపూర్​లోని కాన్ఫిడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ(సీఐఐ) భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్​ గౌడ్​ పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా సీఐఐ ఛైర్మన్ సమీర్ గోయల్​తో కలసి మంత్రి యోగాసనాలు వేశారు. నిత్యజీవితంలో యోగ ప్రాముఖ్యత గురించి వెల్లడించారు. ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా అని కొనియాడారు. యోగాను అందరూ ఆచరించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం సీఐఐ ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఆచార్య జయశంకర్​ స్మరణలో

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయ శంకర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్​ గౌడ్​.. జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఆచార్య జయశంకర్ సేవలను మంత్రి స్మరించుకున్నారు.

'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొని అలుపెరుగని పోరాటం చేసిన తొలి, మలితరం నాయకుడు ఆచార్య జయశంకర్. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన సిద్ధాంత కర్త. సీఎం కేసీఆర్​ నేతృత్వంలో రాష్ట్రంలో జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం. వ్యవసాయ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆచార్య పేరు పెట్టి గౌరవించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన వైతాళికులు, మహానుభావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక వేత్తల జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఎంతో గర్వంగా ఉంది.'

-శ్రీనివాస్​ గౌడ్​- క్రీడా, పర్యాటక శాఖ మంత్రి

నిక్కత్​కు అభినందనలు

అనంతరం ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిక్కత్ జరీన్​ను.. మంత్రి శ్రీనివాస్​​ ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలోని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్​లో నిక్కత్​.. అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారని మంత్రి కొనియాడారు. రాష్ట్రానికి, దేశానికి పేరు, ప్రతిష్ఠలను తీసుకువస్తున్న నిక్కత్ జరీన్​కు... స్పోర్ట్స్ కోటా కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని కల్పించిన సందర్భంగా ఆమెను అభినందించారు.

క్రీడాభివృద్ధికి పెద్దపీట

'ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు... రాష్ట్రంలో క్రీడాకారులకు, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలు, నగదు పురస్కారాలను భారీగా అందిస్తున్నాం. నిక్కత్ జరీన్​కు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థలం కేటాయించడంతో పాటు ఆర్థిక సహాయం అందజేస్తాం.'

-మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్​ శ్రీనివాస రాజు, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: MMTS: ఎల్లుండి నుంచి ఎంఎంటీఎస్‌ సేవలు పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.