ETV Bharat / state

Srinivas goud on Sports: క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

Srinivas goud on Sports: ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేసిన ఘనత పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అనంత్ బజాజ్ మెమోరియల్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్​ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు.

author img

By

Published : Dec 27, 2021, 10:51 PM IST

Srinivas goud on Sports:  క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
Srinivas goud on Sports: క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

Srinivas goud on Sports: క్రీడాకారులకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో, విద్యా రంగంలో రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అనంత్ బజాజ్ మెమోరియల్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేసిన ఘనత పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నమెంట్​లలో మెడల్స్ తీసుకువచ్చారని తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్​లతో కలిసి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ బ్యాడ్మింటన్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. ఈ అనంత్ బజాజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్​లో పలు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్​ హబ్​గా..

'హైదరాబాద్​ స్పోర్ట్స్​ హబ్​గా తయారువుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి వ్యవసాయం, నీటి పారుదల, సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి పెట్టాం. భవిష్యత్​లో క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.' -శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి

ఇదీ చదవండి:

Harish Rao on Niti Aayog: 'సామాన్యుడికి సైతం ప్రపంచ స్థాయి వైద్యం.. అందుకే మూడో ర్యాంకు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.