ETV Bharat / state

Srinivas goud: ఒలంపిక్స్​కు ఎంపికైన తెలంగాణ బిడ్డకు మంత్రి సన్మానం

author img

By

Published : Jun 15, 2021, 6:53 PM IST

టోక్యోలో జరుగనున్న ఒలంపిక్స్​కు బ్యాడ్మింటన్ విభాగంలో ఎంపికైన తెలంగాణ బిడ్డ సాయి ప్రణీత్​ను, వారి తల్లిదండ్రులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఒలంపిక్స్​లో పాల్గొనేందుకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

Minister srinivas goud honors sai praneeth who selected for Olympics
ఒలంపిక్స్కు ఎంపికైన తెలంగాణ బిడ్డకు మంత్రి సన్మానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్​కు దేశం నుంచి బ్యాడ్మింటన్ విభాగంలో ఎంపికైన తెలంగాణ బిడ్డ సాయి ప్రణీత్​ను వారి తల్లిదండ్రులను తన కార్యాలయంలో మంత్రి ఘనంగా సన్మానించారు. ఒలంపిక్స్​లో పాల్గొనేందుకు రాష్ట్ర క్రీడా శాఖ తరుఫున 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అద్భుతమైన ప్రతిభ కనబర్చి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా తీర్చిద్దేందుకు సీఎం కేసీఆర్ క్రీడా పాలసీ తయారీకి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాయి ప్రణీత్ తల్లిదండ్రులు, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.