ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే - హైదరాబాద్ చందానగర్ తాజా వార్తలు

కరోనా మహమ్మారిని నిరోదించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చందానగర్‌లో గుడ్ల ధనలక్ష్మీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వలసకూలీలకు సరకులను ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వితరణ చేశారు.

minister-srinivas-goud-distributes-the-necessities-under-the-charity-at-chandanagar
అక్కడ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే నిత్యావసరాలు పంపిణీ చేశారు
author img

By

Published : May 17, 2020, 4:03 PM IST

హైదరాబాద్ చందానగర్‌లో గుడ్ల ధనలక్ష్మీ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో వలసకూలీలకు నిత్యావసరాలను ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పంపిణీ చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారు కోసం హైదరాబాద్​లో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఆ వాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చేంత వరకూ ప్రతి ఒక్కరూ వైద్యులు, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు.

తన సొంత డబ్బులతో గత 42 రోజులుగా శేరిలింగంపల్లిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్ ధనలక్ష్మి చెప్పారు. తమ స్వచ్చంద సంస్థ ద్వారా ఇప్పటి వరకు 10 వేల సరకుల కిట్లను నిరుపేదలకు అందజేశామన్నారు. లాక్​డౌన్ కొనసాగే వరకు తమ ట్రస్టు ద్వారా నిత్యం పేదలకు నిత్యవసరాలు, కూరగాయలు అందజేస్తామన్నారు. అన్నార్థులకు భోజన వసతిని కూడా కలిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

అక్కడ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే నిత్యావసరాలు పంపిణీ చేశారు

ఇదీ చూడండి : కేంద్రం ప్యాకేజీలో అన్ని దీర్ఘకాలిక సాయాలే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.