హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సురభి కళాకారులు, పేదలు, కార్మికులకు క్రీడా, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, దాతలు ఆదుకుంటున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్... విపత్కర సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తూ నగదు బ్యాంక్లో జమ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఓవైపు కరోనాను కట్టడి చేస్తూనే... మరోవైపు రైతులను, వివిధ వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.