Minister Sridhar Babu Inaugurate Drishti 10 : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ద్రిష్టి-10 మానవరహిత విమానాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలోని అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్(Adani Defense Aerospace)లో రూపొందించిన ద్రిష్టి-10ను నౌకాదళ అధిపతి హరి కుమార్, అదానీ గ్రూప్స్ ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ రంగ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలాంటిదని మంత్రి పేర్కొన్నారు.
Minister Sridhar Babu on Drishti 10 Mission : గతంలో రక్షణ రంగానికి చెందిన ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగామని వివరించారు. 6 దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని హైదరాబాద్‌లో డీఆర్డీఓ, ఆర్‌సీఐ లాంటి ప్రభుత్వ రక్షణ రంగాలను స్థాపించడం వల్లే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మరో 100 యుద్ధ విమానాలకు వాయిసేన ఆర్డర్! రూ.66వేల కోట్లతో డీల్.. శత్రుదేశాలకు చుక్కలే!
"గత 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోని భారత రక్షణ రంగం ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పరుస్తోంది. అప్పటి ప్రధాని దూరదృష్టిలోని భాగంగానే ఇవాళ భాగ్యనగరంలో సొంతంగా రూపొందించిన మిసైల్ ప్రారంభించాం. ఈ యూఏవీని తయారు చేయడం సంతోషంగా ఉంది. ప్రైవేట్ రంగం వారు డిఫెన్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ అవకాశాన్ని అదానీ గ్రూప్ ఉపయోగించుకుని దీన్ని తయారు చేసింది."- దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
Adani Group Made Drishti 10 Mission : అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ గ్రూప్స్ నుంచి వచ్చిన చిన్నపాటి మానవరహిత నిఘా విమానం ద్రిష్టి-10 నౌకదళ రంగానికి అదనపు బలం చేకూరుస్తోందని నౌకదళ అధిపతి అడ్మిరల్ హరికుమార్ అన్నారు. హిందూ మహాసముద్రంలో నిఘా, శత్రువుల సామర్థ్యం అంచనా వేయడానికి 'ద్రిష్టి'(Drishti 10) ఉపయోగపడనుందని ఆయన తెలిపారు. యూరోప్, పశ్చిమ ఆసియాలో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో అరేబియా సముద్రంలో దొంగలు నుంచి పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని హరి కుమార్ తెలిపారు. దేశ భద్రతకు నౌకదళం కట్టుబడి ఉందని చెప్పారు. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా రూపొందించిన రక్షణ రంగ ఉత్పత్తులను ఉపయోగించుకొని మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. సముద్ర తీరంలో భద్రతకు మానవరహిత యుద్ధ విమానం ద్రిష్టి లాంటి అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఎంతో దోహదపడుతాయని వెల్లడించారు.
' 'ఆత్మనిర్బర్ భారత్' కోసం విద్యార్థిలోకం శ్రమించాలి'
నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదు : మంత్రి శ్రీధర్ బాబు