సీఎం కేసీఆర్ పుట్టినరోజును రైతు దినోత్సవంగా జరుపుతామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని... సీసీఐ కేంద్రాల ద్వారా 95 శాతం పంటలు కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు అద్భుతంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. సంప్రదాయ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
96 కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం.. కందులు కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడుతోందని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు వెచ్చిస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారులు దళారులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే జైలుకు పంపుతామని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు