ETV Bharat / state

niranjan reddy: 'అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది.?' - minister niranjan reddy fired on bjp leaders

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన ఈ ఏడేళ్లలో రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి వహిస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా జలాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సంధి కుదర్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం విషయంలో కేంద్రం అవలంబిస్తున్న ధోరణిని తప్పుబడుతూ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

minister niranjan reddy fired on bjp
భాజపాపై మంత్రి నిరంజన్​ రెడ్డి ఫైర్​
author img

By

Published : Jun 20, 2021, 12:53 PM IST

తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రాష్ట్ర భాజపా నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సంతోషం, సంబరాల్లో ప్రజలు ఉండగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారని మంత్రి ఆరోపించారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాకు కేటాయించారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టామని.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది.?

ఏడేళ్లలోనే తెలంగాణ.. హరిత విప్లవానికి కేంద్రమైన పంజాబ్​ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి అన్నారు. ఎఫ్​సీఐ ద్వారా పంజాబ్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం... తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసిందని మండిపడ్డారు.

'అభివృద్ధి దిశలో కొనసాగుతున్న రాష్ట్రాలకు నిధులు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రంలో చలనం లేదు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్‌లో రైల్వే కోచ్, ఖమ్మం జిల్లాలో స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటు ఏమయ్యాయి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్నీ రాష్ట్రంలో కేంద్రం అమలు చేయలేదు.'

సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

సుదీర్ఘ పోరాటం, అనేక మంది బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని మంత్రి హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం నడిచిందే నదీ జలాలు, సాగు నీటి హక్కుల కోసమని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా నీటి వాటా తేల్చలేదని ఆరోపించారు. కృష్ణా జలాలపై ఆంధ్రా నేతల పెత్తనం, అక్రమంగా సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం, తదితర సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.