ETV Bharat / state

అత్యాచార దోషులపై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సత్యవతి - Sathyavathi Rathod on ngkl Incident

రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

minister Sathyavathi Rathod responded on ngkl Incident
అత్యాచారాలకు పాల్పడితే సహించేది లేదు: మంత్రి సత్యవతి
author img

By

Published : Jan 4, 2021, 8:01 PM IST

రాష్ట్రంలో బాలికల హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని, అత్యాచారాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. నాగర్​ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి.. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టారు.

ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారయత్నం చేసి, ఆ ఘటనను సెల్​ఫోన్​లో చిత్రీకరించినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ ఇద్దరిలో ఒకరికి నేర ప్రవృత్తి ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు బాలురపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైందని, జువైనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నాగర్​కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, ఫోక్సో చట్టం కింద పరిహారం అందిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. కేసు త్వరగా తేలేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: 'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.