ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్న తొమ్మిది, పదోతరగతులకు విద్యార్థులను పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు ఇచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం,ఇతర అంశాలపై సమీక్షించారు.
తరగతిగదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని స్పష్టం చేశారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ తరగతులు కొనసాగుతాయన్న మంత్రి సబిత.. మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్ బియ్యాన్ని వాడొద్దని ఆదేశించారు.
ఇదీ చదవండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం