ETV Bharat / state

నేదునూరు మోడల్​ స్కూల్​లో మంత్రి సబిత ఆకస్మిక తనిఖీ - నేదునూరు మోడల్​ స్కూల్​లో మంత్రి సబిత తనిఖీ

'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పర్యటించారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని మోడల్ స్కూల్​లో ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

minister sabitha indra reddy, nedunuru, palle nidra
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నేదునూరు, పల్లె నిద్ర
author img

By

Published : Feb 9, 2021, 11:17 AM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో 'పల్లె నిద్ర' కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంగళవారం ఉదయం.. గ్రామంలోని మోడల్ స్కూల్​ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, శౌచాలయాలు, మంచినీటి వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. వారికి మౌలిక సదుపాయాలను తక్షణమే అందజేస్తామని సబిత హామీ ఇచ్చారు.

నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని చిన్నారులను అడిగారు. పాఠశాల ఆవరణలో రూ. 20 లక్షలతో గ్రంథాలయం నిర్మించి పుస్తకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

minister sabitha indra reddy, nedunuru, palle nidra
విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న మంత్రి సబిత

ఇదీ చదవండి: ఎండోస్కోపిక్‌ బేరియాట్రిక్‌: కోత లేకుండా మధుమేహానికి చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.