రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం... కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాజధాని, పరిసరాల్లో భారీ సంఖ్యలో పరీక్షలు చేయాలనే నిర్ణయించింది. దానితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు, లేబరేటరీలకు కోవిడ్ చికిత్స, పరీక్షలకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. అవి ఎక్కువ మొత్తాలను వసూలు చేయకుండా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్షిస్తున్నారు. హైదరాబాద్, సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలు, ప్రైవేట్ ల్యాబులు, ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు, ధరలపై చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట