ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌తో రిజిస్ట్రేషన్ చేయించామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చొరవతోనే జరిగిందన్నారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని మంత్రి అభిప్రాయపడ్డారు. సాంప్రదాయిక భవనాలతో పోల్చితే ఇవి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
30 నుంచి 50 శాతం విద్యుత్, 20 నుంచి 30 శాతం నీటిని పొదుపు చేసేలా నిర్మించబడ్డాయని ఆర్‌అండ్‌బీవిభాగం భరోసానిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ జోన్‌లో ‘ఉన్న ఐటీ పార్కులను గ్రీన్ బిల్డింగ్స్‌గా రీట్రోఫిటింగ్’ కోసం టీఎస్‌ఐఐసీ - 5 పాయింట్ల కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఐజీబీసీ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందన్నారు. హరిత మార్గం అవలంభిస్తున్న ముఖ్యమైన ప్రభుత్వ భవనాలలో హుడా అనెక్స్ భవనం, పరిశ్రమల కమిషనర్ భవన్, అబిడ్స్, జీ. హెచ్.ఎం.సీ వెస్ట్ జోన్ కార్యాలయం, హైదరాబాద్ భవన్, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అన్ని మెట్రో స్టేషన్లు, సికింద్రాబాద్, హైదరాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లు, రైలు నిలయం భవనం,, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.
ఇవీ చూడండి: జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా