ETV Bharat / state

'ఆ టోల్​గేట్ వద్ద.. రద్దీ నియంత్రణకు మరో నాలుగు లైన్లు' - రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి

రాష్ట్రంలో ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్.హెచ్-65పై కంకోల్ టోల్​గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీ అంశంపై ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అక్కడ రద్దీని తగ్గించేందుకు మరో నాలుగు లైన్లను పెంచబోతున్నట్లు ప్రకటించారు.

minister prashanth reddy said kamkole toll gate four more lines for congestion to traffic control in nh 65
'ఆ టోల్​గేట్ వద్ద.. రద్దీ నియంత్రణకు మరో నాలుగు లైన్లు'
author img

By

Published : Sep 10, 2020, 6:42 PM IST

'ఆ టోల్​గేట్ వద్ద.. రద్దీ నియంత్రణకు మరో నాలుగు లైన్లు'

రాష్ట్రంలో ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్.హెచ్-65పై కంకోల్ టోల్​గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీ అంశంపై ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి వేముల సమాధానమిచ్చారు. ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ వినియోగించడం ద్వారా దేశంలోని జాతీయ రహదారులన్నింటికీ ఏకీకృత టోల్ వసూలు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ విధానం అమలు పురోగతిలో ఉందన్నారు.

ఒక కి.మీ.28/2 నుంచి 235/058 కి.మీ. వరకు, హైదరాబాదు-కరీంనగర్-రామగుండం (హెచ్.కె.ఆర్) రోడ్డు. కి.మీ. 0/000 ల నుంచి 212 కి.మీ. వరకు. నార్కెట్​పల్లి-అద్దంకి-మేదరమెట్ల (ఎన్.ఎం)రోడ్డు వరకు ఫాస్టాగ్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్.హెచ్-65పై కంకోల్ ​టోల్​గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని.. ఆ ట్రాఫిక్ డిమాండ్​ను భరించడానికి ప్రస్తుతం సరిపోయినన్ని టోల్​లేన్లు లేవన్నారు.

ఆ కంకోల్ టోల్​గేట్ గుల్బర్గా ప్రాజెక్టు డైరెక్టరు పరిధిలోని వస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అది బెంగుళూరులోని ఎన్​హెచ్​ఏఐ రీజనల్ అధికారి నియంత్రణలో ఉందన్నారు. టోల్​గేట్ మొత్తం ఎనిమిది లేన్లు ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం రానుపోను కలిపి మరో నాలుగు లైన్లను రాష్ట్ర పరిధిలో పెంచబోతున్నామని వివరించారు.

ఇదీ చూడండి : శాసనసభ ముందుకు మరో నాలుగు బిల్లులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.