ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు ఆధునిక పద్ధతులు అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు బస్సులపై ఈ ఏడాదిలో 7కోట్ల రూపాయల రుసుము వసూలు చేసినట్లు చెప్పారు. గతంలో ఇది కోటి మాత్రమే ఉండేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జిల్లా రవాణాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని... ఆన్లైన్, ఫోన్ ద్వారా వాటిని కమిషనర్ పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. స్మార్ట్ కార్డుల కోసం మూడు రోజుల్లో రిబ్బన్లు, ప్రిటింగ్ మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. 15రోజుల్లో 2లక్షల 30 వేల కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'పీజీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి'