తెలంగాణ రాష్ట్రం నూతన వ్యవసాయ విధానంలో దేశానికి దిశ చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు మారాయని మంత్రి పేర్కొన్నారు. దళారులు, వ్యాపారుల మీద ఆధారపడకుండా తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడిందని మంత్రి నిరంజన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. రైతు కుటుంబం సొంతకాళ్లపై ఎవరి మీద ఆధారపడకుండా, ఆత్మహత్య చేసుకునే స్థితి నుంచి ధైర్యంగా ముందుకు సాగే భరోసాను ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయశాఖలో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున ప్రభుత్వం నియమించిందన్నారు. అధికారులు మార్కెట్ల పరిస్థితి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరాలపై అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. సాంప్రదాయ పంటలొద్దనే రైతుల ఆలోచనను అధికారులు మార్చాలన్నారు. రైతులు లాభం వచ్చే పంటలే సాగు చేసేలా వారికి వివరించాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: 'సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు'