రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. లాభదాయకమైన పంటల వైపు రైతులను ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. దేశంలో మొదటిసారిగా... ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పంటను రికార్డు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అన్నదాత ఆర్థికంగా నిలదక్కుకోవాలన్నదే కేసీఆర్ సంకల్పమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కోటీ 31 లక్షల 50 ఎకరాల్లో పంట సాగవుతుందని తెలిపారు. పప్పుధాన్యాల పంటలను మరింత ప్రోత్సాహిస్తున్నామని... వీటిలో కందిని అధికంగా పండిస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్నను ప్రాధన్యతను బట్టి తక్కువగా పండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి