ETV Bharat / state

Minister Nirananjan Reddy: 'యాసంగి సాగు కోసం అందుబాటులో విత్తనాలు' - telangana agriculture

పత్తికి అధికంగా ధర పలకడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు పెద్ద ఎత్తున పత్తిని సాగుచేయాలన్నారు. యాసంగి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Minister Nirananjan Reddy: 'యాసంగి సాగు కోసం అందుబాటులో విత్తనాలు'

author img

By

Published : Oct 21, 2021, 4:45 PM IST

యాసంగి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పంట మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతుందని మంత్రి తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని మంత్రి వివరించారు. గతంతో పోల్చితే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్ ఉద్యాన శాఖల అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. వేరుశనగ, శనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు పంటమార్పిడి కోసం 8098 శిక్షణా తరగతులతోపాటు వివిధ అంశాల మీద 22,123 శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్‌పామ్​ నర్సరీలలో మొక్కల పెంపకం మీద కూడా మంత్రి సమీక్షించారు. వచ్చే వానాకాలం నాటికి నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్​పామ్‌ మొక్కలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వివిధ మార్కెట్లలో పత్తి ధరలపై సమీక్షించిన మంత్రి.. మద్దతు ధర 6025 రూపాయలు ఉండగా.. 7వేలకు పైగా ధర పలకడంపై మంత్రి హర్షించారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు పెద్ద ఎత్తున పత్తిని సాగుచేయాలన్నారు.

ఇదీ చదవండి: Telangana Governor Tamilisai : ప్రపంచ దేశాలకు మన వ్యాక్సిన్లు అందించే స్థాయికి ఎదిగాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.