ETV Bharat / state

Minister Niranjan Reddy: తెలంగాణలో ప్రత్యేక క్రీడా పాలసీని రూపొందిస్తాం

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని పేర్కొన్నారు. శివారంపల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ క్రికెట్‌ ఎక్స్‌లెన్స్‌ అకాడమీని మంత్రి ప్రారంభించారు.

Minister Niranjan Reddy
మంత్రి నిరంజన్ రెడ్డి
author img

By

Published : Nov 1, 2021, 12:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే క్రీడా పాలసి రూపొందిస్తున్నట్లు చెప్పారు.హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ క్రికెట్‌ ఎక్స్‌లెన్స్‌ అకాడమీని మంత్రి ప్రారంభించారు. త్వరలోనే క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏక‌కాలంలో 150 మంది క్రికెట‌ర్‌లకు శిక్షణ ఇవ్వొచ్చని అకాడ‌మీ డైర‌క్టర్ జ‌గ‌దీష్ రెడ్డి తెలిపారు. శిక్షణ అంటే కేవ‌లం ఆట‌కు సంబంధించి మాత్రమే కాదు, క్రికెటర్ బాడీ మెకానిజం, న్యూట్రిష‌న్, గాయప‌డిన ప్లేయ‌ర్ల‌ను త్వర‌గా రిక‌వ‌రీ చేయ‌డం లాంటివ‌న్నీ... ఒక మేటి క్రికెట‌ర్​ను త‌యారు చేయ‌డంలో ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సాప్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ , మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు.మంత్రి నిరంజన్‌రెడ్డి బ్యాట్‌ పట్టి కాసేపు క్రికెట్‌ ఆడుతూ సరదాగా గడిపారు.

ఇదీ చూడండి: 'ధరలు పెరిగితే ఏంటి?.. ప్రజలు బాగానే సంపాదిస్తున్నారు కదా!'

Cleaning Service : 'మీకెందుకు శ్రమ.. మేం చేసి పెడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.