మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు సాయం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సొంత ఖర్చుతో రెండు ఆంబులెన్స్‌లను అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస కార్యాలయంంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
రెండు ఆంబులెన్స్‌లను వనపర్తి జిల్లాకు కేటాయిస్తున్నట్లు మంత్రి నిరంజన్ స్పష్టం చేశారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఇతర అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ వాహనాలు అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోపగపడతాయని వెల్లడించారు.
- ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ షురూ