ETV Bharat / state

Niranjan reddy: 'పత్తి సాగులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి'

పత్తి సాగులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో తెలంగాణ జిన్నింగ్ మిల్లుల యాజమానుల సంఘం ప్రతినిధుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పత్తి సాగు, విస్తీర్ణం పెంపు, దిగుబడుల అంచనా, నాణ్యత తదితర అంశాలపై చర్చించారు.

minister niranjan reddy review
పత్తి సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
author img

By

Published : Jun 7, 2021, 4:18 PM IST

రాష్ట్రంలో పత్తి సాగు ప్రోత్సాహంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ జిన్నింగ్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది పత్తి సాగు, విస్తీర్ణం పెంపు, దిగుబడుల అంచనా, నాణ్యత, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు

పత్తి నాణ్యతలో రాష్ట్రం జాతీయంగా, అంతర్జాతీయంగా అగ్రస్థానం ఉన్నట్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) ఇప్పటికే పలుమార్లు ధ్రువీకరించిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పంట విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉన్నారన్నారు. సాగు పెరుగుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులకు విద్యుత్ రాయితీ వంటి ప్రోత్సాహం ఇస్తున్న తరుణంలో మరిన్ని పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అంశం సీఎం దృష్టికి తీసుకెళ్లి వర్తింపజేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మిల్లు ద్వారా ప్రత్యక్ష్యంగా 100 మంది, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి కలుగుతోందని అన్నారు. పత్తి విత్తనాల నుండి వచ్చే నూనె, కేక్, సాల్వెంట్ వంటి ఉప ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో జిన్నింగ్ మిల్లుల ప్రోత్సాహం కోసం కాటన్ సాల్వెంట్ పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తా ..

పత్తిలో కూలీల కొరత తట్టుకునేందుకు యాంత్రీకరణకు పెద్దపీట వేసి, ఏకకాలంలో పత్తి దిగుబడి వచ్చే వంగడాల కోసం పరిశోధనలు సాగుతున్నాయని మంత్రి చెప్పారు. గతంలో గులాబీరంగు పురుగు బెడద ఉండేదని... శాస్త్రవేత్తల కృషితో ఇప్పుడా ఇబ్బంది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రాన్ని పత్తి సాగులో అగ్రగామి అని రుజువుచేద్ధామని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. జిన్నర్స్ అసోసియేషన్ సూచనలు, విజ్ఞప్తులు పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.