రాష్ట్రంలో ప్రతిభ ప్రాతిపదికనే మండల వ్యవసాయ విస్తరణ అధికారుల నియమకాలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత పంటల సాగు అమలు కోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
తాత్కాలిక ప్రాతిపదికన ఏఈఓ ఉద్యోగుల నియామకానికి ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఏఈఓ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించామని ఆయన ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న దృష్ట్యా... అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాదిపదిక అని చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. దళారులను ఆశ్రయించి మోసపోద్దన్నారు.
ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి