ETV Bharat / state

'ఇంటివద్దకే పండ్లు, కూరగాయల కార్యక్రమానికి అనూహ్య స్పందన'

ఇంటివద్దకే పండ్లు, కూరగాయల కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీనికి అనువుగా మరొక నెంబరును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

minister-nirajan-reddy-on-fruits-and-vegetables-distribution
'ఇంటివద్దకే పండ్లు, కూరగాయల కార్యక్రమానికి అనూహ్య స్పందన'
author img

By

Published : Apr 14, 2020, 7:33 AM IST

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఇంటివద్దకే పండ్లు, కూరగాయల కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. 1370 చోట్ల ఇంటివద్దకే పండ్ల సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. 2వేల 5వందల మంది ఆన్​లైన్​లో ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్‌ చేసిన 24 గంటల్లోనే ఇంటి వద్దకు పంపిస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

అదనంగా...

కాల్ సెంటర్​లో ఒకటే నంబర్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... ప్రస్తుతం ఉన్న 7330733212 నంబరుకు అదనంగా 9114445555 నంబరు ఏర్పాటు చేశామని తెలిపారు. 201 మొబైల్ రైతుబజార్లతో... 403 ప్రాంతాల్లో కూరగాయలు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమానికి జంట నగరాలలో అనూహ్య స్పందన లభించిందని తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: మాస్క్​లో సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.