హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో రూ. 9కోట్ల 17లక్షలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుల్లాగూడలో 5కోట్ల 50లక్షలతో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రంను, లలితనగర్‌లో 8లక్షలతో నిర్మించిన మోడల్ మార్కెట్, అయ్యప్ప కాలనీలో కోటి 96లక్షలతో అలాగే చింతలకుంట కూడలిలో 25 లక్షలతో నిర్మించిన ఐస్లాండ్ పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. ఎల్బీనగర్ రామోజీ ఫిల్మ్‌సిటీ వెళ్లే మార్గంలో చిత్రసీమను సూచిస్తూ ఉన్న ప్రతిమ అందర్ని ఆకట్టుకుంటోంది. బంగారు తెలంగాణ దిశగా కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి :అనిశాకు చిక్కిన తహసీల్దార్ లావణ్య భర్త