ETV Bharat / state

ఈఎస్​ఐ ఎంతో అభివృద్ధి చెందింది: మంత్రి మల్లారెడ్డి - ఈఎస్​ఐ ఆసుపత్రి తాజా వార్తలు నాచారం

తెలంగాణ ఏర్పడిన తరువాత ఈఎస్​ఐ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కాన్సర్​, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్రతి నెల సరిపడే మందులు అందిస్తామని వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని రూ. 200 కోట్లతో అభివృద్ధి చేసి, కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు.

ఈఎస్​ఐ ఎంతో అభివృద్ధి చెందింది: మంత్రి మల్లారెడ్డి

author img

By

Published : Sep 30, 2020, 7:49 PM IST

తెలంగాణ ఏర్పడిన తరువాత ఈఎస్​ఐ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్​ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్​లో కిడ్నీ, కాన్సర్ బాధితుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంప్​కు ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి హాజరయ్యారు. కాన్సర్​, కిడ్నీ రోగులకు నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జనరల్ వార్డ్​ను ప్రారంభించారు.

కాన్సర్​, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్రతి నెల సరిపడే మందులు అందిస్తామని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని రూ. 200 కోట్లతో అభివృద్ధి చేసి, కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా బాధితుల కోసం 50 పడకల వార్డును హాస్పిటల్లో సిద్ధంగా ఉంచామన్నారు.

ఇదీ చదవండి: 'ఇకపై ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.