రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర హోమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మెహిదిపట్నం ఎల్ఐసీ పార్కులో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. మహిళా పట్టభద్రులంతా తెరాస అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూచించారు.
ప్రజా సేవ చేసే అవకాశం ఇస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమందికి సహాయం చేశానని ఆమె తెలిపారు. ఈనెల 14న జరిగే ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెరాస నాయకులు పాల్గొన్నారు.